
హనుమకొండ:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా దివాస్ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన విద్యార్థి,యువజన ఉద్యమకారుల అలయ్-బలయ్ కార్యక్రమాన్ని రెవెన్యూ అతిథి గృహం మైదానంలో నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమానికి ఆనాటి ఉద్యమకారునిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి,ఉద్యమకారుల అమరత్వం మరువలేనిదన్నారు... తెలంగాణ ఒస్తే తమ బతుకులు బాగుపడుతాయని తెగించి కోట్లాడిన మీ తెగువకు తెలంగాణ సమాజమే వందనం చేసిందని ఈ సందర్భంగా అలయ్-బలయ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు...
ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉద్యమకారులు మాజీ ఎంపీ సీతారాం నాయక్,రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న,ప్రొఫెసర్ చింతకాయల దినేష్ కుమార్,విద్యార్థి ఉద్యమకారుడు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డా కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి హాజరై ఆనాటి విద్యార్థి ఉద్యమకారుల పాత్రను కొనియాడారు..
అనంతరం విద్యార్థి,యువజన ఉద్యమకారులకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,జడ్పీటీసీలు సైదిరెడ్డి, శ్రీరామ్ శ్యామ్, సబాధ్యక్షులు బొల్లికొండ వీరేందర్,జోరిక రమేష్,పలు విద్యార్థి సంఘాల నాయకులు,యువజన సంఘం నాయకులు, పలు డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు…