వరంగల్ ఖిలా మండలం రంగశాయిపేట సిపిఎం శాఖ ఆధ్వర్యంలో 139వ అంతర్జాతీయ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాఖ కార్యదర్శి ఉసిల్ల కుమార్ మాట్లాడుతూ, కార్మికుల పోరాటాల ఫలితంగా 8 గంటల పని దినాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని విమర్శించారు. కార్యక్రమంలో అనిల్, జ్యోతి, రత్నం, బాబు తదితరులు పాల్గొన్నారు.