జనగామ జిల్లాలో మే 4న జరగబోయే నీట్ 2025 పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల,పెంబర్తి ఎం.జె.పి.టి కళాశాలలో మొత్తం 582 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు.49 మంది పర్యవేక్షకులను నియమించారు.పరీక్ష మధ్యాహ్నం 2 నుండి 5 వరకు జరుగుతుంది.మధ్యాహ్నం 1:30కి మించిన తరువాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు.అడ్మిట్ కార్డు,గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి.మొబైల్ ఫోన్లు,గడియారాలు,నగలు తదితర పరికరాలు నిషేధించబడ్డాయి.పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని,భద్రత కోసం పోలీసులు,జిల్లా,జాతీయ పరిశీలకులు సమన్వయంగా పర్యవేక్షిస్తారని అధికారులు వెల్లడించారు.