హనుమకొండ: మే 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పలు కీలక సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నట్లు తెలిపారు.పరీక్షా గదుల్లోనే పెన్నులు అందజేస్తారని,అభ్యర్థులు స్వయంగా పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావద్దన్నారు.అడ్మిట్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజు,పోస్టుకార్డు సైజు ఫోటోలు,ఐడి ప్రూఫ్,ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని స్పష్టం చేశారు.పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.