కమ్యూనిస్టు పాలనలోనే ప్రజా సమస్యల పరిష్కారం..పేదలకు భూమి,ఇళ్ళు,
Uncategorizedఉద్యోగాలు,స్వేచ్ఛ,స్వాతంత్ర్యం.
సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి
76 యేండ్లుగా పరిపాలించిన పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్,
BRS పాలనలో ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం జరిగింది. 139 మేడే వారోత్సవాల సందర్భంగా ఈ రోజు వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామంలో రెండు కేంద్రాల్లో మరమల మల్లీశ్వరి,శంకర్,గోగర్ల లక్ష్మి గార్ల నాయకత్వంలో
సీపీఎం జెండా ఎగుర వెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సంకె రవి సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి,గుమసా అశోక్ CPM మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు హాజరై మాట్లాడడం జరిగింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సం.రాలు గడిచిపోయిన నేటికీ పేదల ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు.పైగా పేదరికం పెరిగిపోయింది.
భారత రాజ్యాంగం ఇచ్చిన హాక్కులైనా ప్రతి ఒక్కరికీ ఇళ్ళు,చదువు,ఉద్యోగం,ఆరోగ్యం నేటికీ అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది.పాలకులు,కార్పొరేట్ సంస్థల యజమాన్యలకు ఊడిగం చెయ్యడం జరుగుతుంది. వేమనపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో పారెస్ట్ శాఖ అధికారులు పేదల సాగులో ఉన్న భూములను,పట్టా భూములను సాగు చేసుకొనివ్వడం లేదు.
పేదలపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చెయ్యడం జరుగుతుంది.
పేదలు నివాస ముంటున్న గ్రామాల్లో గుడుంబా,బెల్ట్ షాపులల్లో మద్యం ఏరులై పారుతున్న ఎక్సైజ్,పోలీస్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.దీనివలన పేదలు,
వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.ప్రతి కుటుంబానికి ఇళ్లు,భూమి,ఉద్యోగం,స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కులను కూడ నేటి పాలకులు అమలు చెయ్యడం లేదు..
నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య సోషలిస్టు వ్యవస్థలో పరిష్కారం జరుగుతాయి.ప్రజలు సీపీఎం పార్టీని బలోపేతం చేయడం ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని పిలుపు నివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కామెర మధుకర్,సరిత,బొందయ్య,మల్లయ్య,రామయ్య,జయ మరియు ప్రజలు పాల్గొన్నారు.