ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవంతం
-ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవంతం
ఈ69న్యూస్,శింగనమల.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ మరియు అనంతపురం జిల్లా వాసి అయిన శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి చేపట్టిన గ్లోబల్ కనెక్ట్ పర్యటనకు సిడ్నీలో శుభారంభం జరిగింది.మే 2, 2025న సిడ్నీ నగరంలో నిర్వహించిన తొలి సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను కలిపి, ప్రజల ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సమావేశంలో శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ
జగనన్న నాయకుడు కాదు, ఒక స్టేట్స్స్మా న్ అని ప్రజల గుండె ధ్వనిని అర్థం చేసుకునే మార్గదర్శన్నారు.ఆయన 3,648 కిలోమీటర్లు ఓటు కోసం కాదు ప్రతి గుండెను వినటానికే నడిచారని,ప్రతి హామీని ఒక నైతిక ఒప్పందంగా భావించి 99% అమలు చేసిన ఘనత జగనన్నదేనన్నారు.
మేనిఫెస్టో నా బైబిల్, నా భగవ్గీత, నా ఖురాన్అని చెప్పే నాయకుడు ఆయనని,ఆయన పాలనలో స్కాం లేదు సేవ ఉంది, గెలుపు కోసం కాదు, ప్రజల గౌరవం కోసం పాలనని,ప్రజల ఇంటి వద్దకే పాలనను చేరుస్తూ, ప్రతి వర్గానికీ, ప్రతి ఇంటికీ అండగా నిలిచారని దేశంలో ఇలా నైతికత, నిబద్ధతతో ఉన్న నాయకుడు మరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీ పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు
1. పాలనా విప్లవం – సచివాలయాలు, వాలంటీర్లు, స్పందన, సామాజిక ఆడిట్లు
2. ఆరోగ్య విప్లవం – మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ విస్తరణ
3. విద్యా విప్లవం – నాడు-నేడు, డిజిటల్ తరగతులు, విద్యా దీవెన, ట్యాబ్లెట్లు
4. సంక్షేమ విప్లవం – ₹4.47 లక్షల కోట్లు డీబీటీ, అమ్మఒడి, చేయూత, రైతు భరోసా
5. ఆర్థిక & పారిశ్రామిక అభివృద్ధి – ₹13 లక్షల కోట్ల పెట్టుబడులు, మెగా ప్రాజెక్టులు
6. మౌలిక సదుపాయాల అభివృద్ధి – పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారులు, ఇండస్ట్రియల్ పార్కులని,సామాజిక మాధ్యమాల్లో ప్రవాసాంధ్రుల బాధ్యత ప్రతి పోస్ట్, ప్రతి షేర్ ఓటుతో సమానమన్నారు.నిజాన్ని గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రవాసాంధ్రులదేనని సాంబశివారెడ్డి స్పష్టం చేశారు.భావోద్వేగ సందేశం- మీరే మార్పు,మీరు రాజకీయ నాయకులు కాకపోయినా, మీరు చేసే ఒక్క పోస్ట్, కలిపే ఒక్క మిత్రుడు రాష్ట్ర భవిష్యత్తును మార్చగలడని,ఈ పర్యటన బాధ్యతను గుర్తు చేయడమే కాదు భవిష్యత్తు కోసం పోరాటానికి స్ఫూర్తన్నారు.ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, సిడ్నీ కన్వీనర్ అమర్ మరియు స్థానిక వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.