www.e69news.com డీసీసీ పదవుల్లో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యం -డీసీసీ అధ్యక్ష పదవికి రాయపురం సాంబయ్యకు అవకాశం ఇవ్వాలని (ఏకలవ్య) అభ్యర్థిత్వం హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించింది.టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ,మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో హనుమకొండ-వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవికి రాయపురం సాంబయ్య (ఏకలవ్య) అభ్యర్థిత్వం ప్రకటించారు.ఎస్టీ వర్గానికి చెందిన ఆయన,నిష్ఠతో పార్టీకి సేవలందిస్తూ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నారు.