
సముద్రాల: ఇల్లు కోసం ఓ నిరుపేద మొర
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన పేద కార్మికుడు కొన్నోజు వీరాచారి తలదాచుకునే ఇంటి కోసం ఇందిరమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. ముగ్గురు కుమార్తెలు, వికలాంగుడు ఉన్న కుమారుడితో జీవన పోరాటం సాగిస్తున్న వీరాచారి ప్రస్తుతం చెరువు కట్టపై రేకులతో నిర్మించిన గుడిసెలో నివసిస్తున్నారు. “కనీసం జీవించేందుకు గూడు కూడా ఇవ్వట్లేదేంటి?” అంటూ అధికారులు, నాయకులను సాయానికి వేడుకుంటున్నారు.