
హుజూర్నగర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
పాలకీడు మండలం జాన్ పహాడ్ కొత్త తండాలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.రమావత్ చంద్రకళతో పాటు పలువురికి చెక్కులు అందజేశారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి చేరాలని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు,మార్కెట్ యార్డ్ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్,పాలకవీడు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్. వి.సుబ్బారావు మాజీ జెడ్పిటిసి మోతిలాల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.