
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు
సోమవారం నర్రా రాఘవరెడ్డి భవన్ లో సిఐటియు మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా పేద ప్రజల జీవితాలు అతనివుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పనిని చట్టబద్ధం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను ప్రతితను కఠిన తరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వాటిని తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పుకొట్టాలని పోరాడి సాధించుకున్న చట్టాలను హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఐఎన్టీయూసీ,ఏఐటియుసి, సిఐటియు, బిఆర్టియు, టియుసిఐ, ఐఎఫ్టియు, హెచ్ఎంఎస్, టిఎన్టియుసి,ఏ ఐయుటియుసి, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాల అసోసియేషన్లు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. కార్మికులు ఈ సమ్మె ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ నాయకులు మంత్రాల మంగమ్మ కంచర్ల జానయ్య పాలడుగు చంద్రయ్య గంటేకంపు పర్షరాములు బోల్లెద్దు నాగయ్య లింగయ్య యాదయ్య సైదులు తదితరులు ఉన్నరు