
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న
గ్రామపంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న
ఈరోజు డీపీఓ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి సమ్మె నోటీ అందజేత చేయడం మే 20న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్&వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని డీపీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బరితెగించి కార్పొరేట్ మతోన్మాదులకు అనుకూలంగా పేద ప్రజలకు, కార్మికులకు వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తుందని అన్నారు. అనేక త్యాగాలు, రక్త తర్పణలతో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను రద్దు చేసి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ అమలు చేయాలని మోడీ ప్రభుత్వం తహతహలాడుతుందని అన్నారు. మరోపక్క దేశ ప్రజలు కూడబెట్టుకున్న జాతి సంపదను సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థల వాటాలను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో బడా బాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని విమర్శించారు. కార్మికులందరికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉరితాలుగా మారే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, ఉద్యోగ భద్రతలు కల్పించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు అశోక్,వెంకట్రావు, సోనేరావు,గంగన్న,కిరణ్,సంతోష్ రాజేందర్,శంకర్, నరేష్,వర్ణ,కత్తి మల్లమ్మ,మీరాబాయి తదితరులు పాల్గొన్నారు.