
కళలు సజీవంగా ఉండాలంటే సమాజం నుంచి సహకారం అవసరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, శ్రీ వెంకటేశ్వర చిందు యక్షగానం సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రాచీన కళారూపాల్లో యక్షగానంకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతి, జానపద సంపదను రక్షించుకోవడానికి, తద్వారా భావితరాలకు అందించడానికి ఇలాంటి కళా కార్యాచరణలు ఎంతో అవసరం. ప్రభుత్వం ఈ కళల అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర చిందు యక్షగానం సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమైనవి. స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు మరింత సహకారం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు..అలాగే, కళలు సజీవంగా ఉండాలంటే సమాజం నుంచి సహకారం అవసరం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.కళారంగంలో విశిష్ట సేవలందించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయా ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయా సేవలను గుర్తు చేస్తూ ఆమె మాట్లాడుతూ –”సమ్మయా చేసిన కృషి ఈ తరం కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయనకు అందించే ఈ సన్మానం, తెలంగాణ రాష్ట్రం తరఫున ఒక గౌరవ సూచికగా భావించాలి” అని కొనియాడారు.ఈ వేడుకల్లో పలు ప్రాంతాల నుండి వచ్చిన సంస్థ సభ్యులు, కళాకారులు, సంస్కృతిక ప్రేమికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, పత్రికా సంస్థల ప్రతినిధులు, మరియు పలువురు ఆహ్వానిత అతిథులు పాల్గొన్నారు. యక్షగానం ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల సత్కారాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి..కార్యక్రమం ముగింపు సందర్భంగా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు మరియు కళా అభివృద్ధికి మరింత ప్రభుత్వ సహకారం కోరారు..