
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్
జఫర్ఘడ్, మే 8: జిల్లా పరిషత్ హైస్కూల్ హిమ్మత్‌నగర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యంగ్ ఇండియా సమ్మర్ క్యాంపు ప్రారంభమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ మాట్లాడుతూ, విద్యార్థులకు శాస్త్రీయ సంగీతం, స్టిచ్చింగ్, పెయింటింగ్, చెస్ వంటి నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నోటుబుక్లు, పెన్నులు, స్నాక్స్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ శిక్షణ శిబిరం ఈ నెల 25 వరకు కొనసాగనుంది.