
రాయలసీమ విద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ రెక్టారు N.T.K నాయక్ ను తక్షణమే విధుల నుండి తొలగించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి-కుల- ప్రజా-మహిళా సంఘాల ఐక్య వేదిక నాయకులు శేషఫణి, పట్నం రాజేశ్వరి, నక్కలమిట్ట శ్రీనివాసులు, ఖధీరుల్లా, సీమకృష్ణ, వెంపేంట రాంబాబు,భరత్ కుమార్ ఆచారి,నంది విజయలక్ష్మీ , పెరుగు శివకృష్ణ, కరుణాకర్, నాగభూషణం లు డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్ డాక్టరు వెంకట బసవరావు మరియు రిజిస్ట్రార్ విజయకుమార్ నాయుడు లకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యాలయ కేంద్రంగా కాకుండా అక్రమార్కులకు అవినీతిపరులకు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారడం బాధాకరం అని వారు తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి తలమానికంగా నిలిచిన రాయలసీమ విశ్వవిద్యాలయం అభివృద్ధికి నోచుకోక పోవడం శోచనీయమని వారు అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, ఇంఛార్జి వైస్ ఛాన్సలర్ గా పనిచేసి ప్రస్తుతం రెక్టారుగా పనిచేస్తున్న N.T.K నాయక్ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, రోస్టర్ అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగాల భర్తీ చేసుకుని తనకంటూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకుని నియంతలా యూనివర్సిటీలో చలామణీ అవుతున్నాడని వారు తెలిపారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తు తనకు తిరుగు లేకుండా చేసుకున్నాడని వారు అన్నారు. ప్రొఫెసర్ N.T.K నాయక్ పై C.B.CID వారు మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు విచారణ జరిపి అవినీతికి పాల్పడినది వాస్తవమని ఉన్నత విద్యా మండలి వారికి నివేదిక అందజేస్తూ చర్యలకు సిఫారసు చేశారు.ఉన్నత విద్యా మండలి వారు N.T.K నాయక్ అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం N.T.K నాయక్ పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని అడిషనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ పోలీసు వారికి ఎండార్స్మెంట్ పంపించడం జరిగింది అని వారు తెలిపారు.అయితే గత ప్రభుత్వ అండతో N.T.K నాయక్ అన్నీ తొక్కి పెట్టించు కున్నాడు కానీ యూనివర్సిటీ పాలకమండలి N.T.K నాయక్ కు రెండు ఇంక్రిమెంట్స్ కట్ చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా,ఆర్థికపరంగా ఏలాంటి అధికారి పదవులు లేకుండా ప్రొఫెసర్ గా (రెక్టారు) మాత్రమే అవకాశం ఇచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తీర్మానం చేశారని వారు అన్నారు. N.T.K నాయక్ అవినీతి అంతా ఇంతా కాదు కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, యూనివర్సిటీ భూములు సుమారు 150 ఎకరాలు కూడా గత ప్రభుత్వ రాజకీయ నాయకులకు అప్పనంగా కట్టబెట్టారని వారు తెలిపారు. N.T.K నాయక్ చేసిన అవినీతి అక్రమాల పై చర్యలు చేపట్టాలని లేని పక్షంలో యూనివర్సిటీ ముందు ప్రజా కుల సంఘాలు పోరాటం చేయాల్సి వస్తుందని వారు తెలుపుతూ రాయలసీమ విశ్వవిద్యాలయం ఉద్యోగులతో కలిసి ఉపకులపతి గారికి, రిజిస్ట్రార్ గారికి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.