
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జిల్లాలో మహిళల సాధికారత కోసం 395 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి,31,247 మందికి ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం జిల్లాలోని పాఠశాలలు,కళాశాలల్లో శానిటరీ నాప్కిన్స్ దహన యంత్రాలు(ఇన్సినరేటర్లు) ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ యంత్రాల వాడకంతో పరిశుభ్రత మెరుగు పడి,విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని విద్యార్థులు,ఉపాధ్యాయులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.