యువత కర్మల సంస్కరణ చేసుకుని సన్మార్గంలో నడవాలి-సౌత్ ఇండియా యువజన సమితి ఉపాధ్యక్షుడు అతాఉల్ బషీర్ E69 న్యూస్ హన్మకొండ/దామెర హన్మకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గ్రామంలో రెండు రోజుల పాటు మజ్లిస్ ఖుద్దాముల్ అహ్మదీయ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వార్షిక ఇజ్తిమా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుండి ఇజ్తిమాలో పాల్గొన్న బాలురులకు,యువకులకు వివిధ రకాల ఆటల పోటీలు,ధార్మిక విద్యా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియా యువజన సమితి ఉపాధ్యక్షుడు అతాఉల్ బషీర్ ముఖ్య అతిథిగా పాల్గొని యువతకు సందేశం ఇచ్చారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి,కర్మల సంస్కరణ చేసుకుని సన్మానంలో నడవాలని,అలాగే ధార్మిక గ్రంథాలను పఠించడం అలవాటు చేసుకోవాలని సూచించారు.ప్రేమే లక్ష్యం-సేవే మార్గంగా అహ్మదీ యువత సమాజ సేవ చేయడంలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యువజన సమితి అధ్యక్షుడు మౌల్వీ మసూద్ అహ్మద్,ఉపాధ్యక్షుడు ఇఫ్తిఖార్,జిల్లా అధ్యక్షుడు లతీఫ్ షరీఫ్,ఉపాధ్యక్షుడు సలీం,ఇంచార్జీ అసిఫ్,స్థానిక అధ్యక్షుడు సలాం,రవినగర్ అధ్యక్షుడు యాకూబ్ పాషా,కటాక్షపూర్ అధ్యక్షుడు వలీ,నారాయణపురం అధ్యక్షుడు రహీమొద్దీన్ వరంగల్ పట్టణ మిషనరీ ఇంచార్జీ అయాన్ పాషా,ఇజ్తిమా కమిటీ అధ్యక్షుడు అహ్మద్ పాషా,వివిధ గ్రామాల మౌల్వీలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉచిత హోమియో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు.