
***–కలెక్టర్ శివలింగయ్య కి సిఐటియు వినతి*~~~~~~~~~~~~~~~~*జనగామ: భవన నిర్మాణ రంగాల కార్మికుల సౌలభ్యం కోసం లేబర్ అడ్డ బ్రిడ్జి కింద ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ శివలింగయ్య గారికి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు**ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ* జనగామ పట్టణం మరియు జనగామ చుట్టుపక్కల గ్రామాల నుండి భవన నిర్మాణ కార్మికులు తన లేబర్ ఆట వద్దకు వందలాదిమంది రోజు వారి పనుల కోసం వస్తుంటారని అన్నారు ప్రస్తుతం ఉన్న లేబర్ అడ్డా ప్రధాన రోడ్డు మీదనే ఉండడం కనీసం కాళీ స్థలం లేకపోవడంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారులేబర్ అడ్డా బ్రిడ్జి కిందకు ఏర్పాటుచేసి మూత్రశాలలు మరుగుదొడ్లు మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు *జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యపై తక్షణమే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని లేబర్ అడ్డా ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం తక్షణమే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం అభినందనీయమని అన్నారు*ఈ కార్యక్రమంలో సిఐటియు బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తాండ్ర ఆనందం జిల్లా నాయకులు గంగరబోయిన మల్లేష్ రాజ్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు మారడి వినోద్ తదితరులు పాల్గొన్నారు