ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని రేగొండ మండలంలోని ఎస్ ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్లో ఎమర్జెన్సీ డే సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షలు ఏడునూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి విజయ రామారావు మరియు ఉప్పల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి హాజరై,ముందుగా ఎమర్జెన్సీ కాలంలో నాటి ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించి తిలకించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ 1977 మార్చి 21వరకు ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి ప్రతికలను సెన్సార్ చేశారన్నారు. వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించిన పత్రికలపై తీవ్ర నిర్బంధం విధించారని, ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతునొక్కారని, ఎన్నో సంస్థలను రద్దు చేశారని విమర్శించారు. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే 1975 జూన్ 25న ఒక ‘చీకటి రోజు’గా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరతను, అశాంతిని కారణంగా చూపుతూ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారు. ఇదే రోజున ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు హేమాహేమీ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, బిజూ పట్నాయక్, చంద్రశేఖర్ లాంటి మరెందరో ప్రముఖులతో సహా లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైళ్లలో పెట్టారు. అంతేకాకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ప్రభుత్వ వ్యతిరేక నిరసననలను ఉక్కుపాదంతో అణచివేయడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం జరిగింది. ‘ఎమర్జెన్సీ’ అంటే ఇందిరా గాంధీకి ఒక పర్యాయపదంగా మారిపోయింది. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ 1977 మార్చ్ 21 వరకు అంటే 21 నెలల పాటు అమలులో ఉంది. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అంతర్గత అశాంతిని కారణంగా ఉటంకిస్తూ అధికారికంగా ఎమర్జెన్సీని జారీ చేశారని కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.
అనంతరం ఎమర్జెన్సీ కాలంలో జైలుకు పోయిన వారిని శాలువాతో సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి,పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు,మాజీ కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి,రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి, అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు బట్టు రవి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతిరావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్, జిల్లా నాయకులు దొంగల రాజేందర్,రేగొండ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్, బిజేపి మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల కిరణ్, తూర్పటి మల్లేష్ , బిజెపి కొత్తపల్లి గోరి మండల అధ్యక్షులు విష్ణు యాదవ్,వేణు,ఎల్లవులరాజు,శివరాజ్,రాకేష్,శివకృష్ణ,వివిధ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.