ఈ69న్యూస్ ధర్మసాగర్ మండలం,జూన్ 26: ధర్మసాగర్ మండలంలోని సాయి పేట గ్రామానికి చెందిన ముద్ర వేణి శ్రీకాంత్ (27),తండ్రి పేరు కొమురయ్య, ఈ నెల 23వ తేదీ ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఎల్కతుర్తిలోని తమ భూమిని దున్నించి వస్తానని తన కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు.అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి రాలేదు.శ్రీకాంత్ తిరిగి రాకపోవడంతో అతని భార్య ముద్ర వేణి మానస పోలీసులకు ఫిర్యాదు చేశారు.అందుకు స్పందించిన ధర్మసాగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకున్న వారు వెంటనే కింది నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ సెల్:8712685010,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్:8712685127,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్: 8712685247 ప్రజలు సహకరించి సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.