E69 న్యూస్ హన్మకొండ : అయినవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల తిరుపతి కుమారుడు మామిళ్ల అభిలాష్ గత సంవత్సరం పున్నెలు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.బుధవారం జరిగిన అభిలాష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా,తిరుపతి దంపతులు కుమారుని విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి తిరుపతి బాల్య మిత్రులు హాజరై,ఆయనతోపాటు అభిలాష్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.పుత్రవియోగంలో శోకసంద్రంలో ఉన్న మిత్రుడికి అండగా నిలుస్తామని,ఎప్పుడూ తోడుగా ఉంటామని తమ భరోసా ప్రకటించారు.వారిలో శీర గణేష్,సింగణబోయిన పరశురాములు,సాంబారి రాజు,గోనె రాజు,పెండ్లీ రమణయ్య,కాసోజు విజయ్,పాక కోటేశ్వర్,గడ్డం రమేష్,ఎం.డి.అజీమ్,పొన్నం సంతోష్ తదితరులు ఉన్నారు.మమకారపు మద్దతు ఈ ఘటనలో మానవ సంబంధాల విలువను చాటిచెప్పింది.