
ఈ69న్యూస్ వరంగల్:ఎంజీఎం హాస్పిటల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు హాస్పిటల్ అవుట్‌పోస్ట్ ఎదుట అచేతనంగా పడిపోయి ఉన్నారు.సంఘటనా స్థలానికి చేరుకున్న వాట్ బాయ్స్ అతనిని తక్షణమే ఎమర్జెన్సీ వార్డుకు తరలించగా,అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు.మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు కాగా,ఆయన ఆరెంజ్ కలర్ షర్ట్ ధరించి ఉన్నారు.మృతుడి వ్యక్తిగత వివరాలు ఇప్పటివరకు గుర్తించబడలేదు.ఈ వ్యక్తికి సంబంధించి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే,ఎంజీఎం అవుట్‌పోస్ట్ నంబర్ 87126 85058 లేదా మత్వాడా పోలీస్ స్టేషన్ నంబర్ 87126 85005 కు తక్షణమే తెలియజేయాలని పోలీసులు కోరారు.