
ఈ69న్యూస్ హనుమకొండ:ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విద్య శాఖ,ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కేజీబీవీ,ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి,రెండో దశలో చేపట్టిన అభివృద్ధి పనులు,వాటి పురోగతి గురించిన వివరాలను డీఈవో వాసంతి,ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ..జిల్లాలోని తొమ్మిది కేజీబీవీ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేయడంపై వారం రోజుల్లోతెలియజేయాలన్నారు.విద్యార్థులకు అవసరమైన వివిధ సదుపాయాలను పాఠశాలలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,కేజీబీవీ,కళాశాలలు,గురుకులాలు,అంగన్వాడీ కేంద్రాలలో తాగునీరు,విద్యుత్,టాయిలెట్స్,తదితర అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాలన్నారు.ఈ సమావేశంలో ఈఈ నరేందర్ రెడ్డి,డిఈ రవీందర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.