
ఈ69న్యూస్ హన్మకొండ /ధర్మసాగర్:పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలందించిన వారిలో ఒకరైన వరంగల్ సీఐడి విభాగంలో సీఐగా పని చేస్తున్న నోముల ప్రభాకర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి అతి ఉత్తమ సేవా పథకం ప్రదానం చేసింది.ఇప్పటికే 1989లో పోలీస్ సేవా పతకం,2000లో ఉత్తమ పోలీస్ పతకం,2005లో ఇండియన్ పోలీస్ మెడల్ పొందిన ప్రభాకర్ రెడ్డి,తన సేవా ప్రయాణంలో 100కు పైగా అవార్డులు,రివార్డులు,ప్రశంసా పత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా ధర్మసాగర్ గ్రామస్తులు ఆయనకు ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు.కార్యక్రమంలో కొట్టె ఎల్లయ్య ఆధ్వర్యంలో నిమ్మ సుదర్శన్ రెడ్డి, కూనూరు రాజు,లాయర్ రావుల వేణు మహేందర్ రెడ్డి,పాక మల్లయ్య (రిటైర్డ్ ఆర్టీసీ),గంగారపు శ్రీనివాస్,బొడ్డు భరత్,కొలిపాక మల్లికార్జున్,గుర్రపు రవీందర్ (శ్రీరామ్ క్లాత్ స్టోర్స్), ఏనుట్ల సాంబరాజు,రాజేందర్ (రిటైర్డ్ ఉపాధ్యాయులు),కొట్టె రమేష్ తదితరులు పాల్గొన్నారు.