
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి.సోమయ్య
జాఫర్గాడ్ మండల కేంద్రంలో సీపీఐ సిపిఎం పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేస్తూ ర్యాలీ సభ నిర్వహించడం జరిగిందని తెలిపారు
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జువారి రమేష్ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి.సోమయ్య మాట్లాడుతూ అతి తక్కువ సీట్లతో మూడోసారి అధికారులకు వచ్చిన మోడీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ భారతదేశాన్ని అంబానీలకు అప్పజెప్పే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులకు ప్రమాదంగా ఉన్నటువంటి ఈ యొక్క లేబర్ కోడ్లను తీసుకువచ్చి తిరిగి 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది పరిశ్రమలు మూతబడి లక్షలాది కార్మికులు నడిరోడ్డున పడ్డారని, సంఘం పెట్టుకునే హక్కు ,సమ్మె చేసే హక్కు లేకుండా రానున్న కాలంలో కార్మికులను ఉక్కుపాదం మోపే చట్టాలను తీసుకొచ్చి కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్యక్రమం మోడీ చేస్తున్నాడని అమరుల త్యాగల పోరాట ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నామని మోదీ ప్రభుత్వం ఆలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక రైతన్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం యావత్ భారత పౌరులు ఏకమై మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండెబోయినా రాజు సీపీఐ మండల నాయకులుజిల్లా నాయకురాలు MD శభనా MD యాకూబ్ పాషా సుధాకర్ చంద్రమౌళి కటా సుధాకర్ సాయులు నల్లతిగల శ్రీను ఎర్రం సతీష్ కుమార్ చిరంజీవి బాబు వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు