
E69 news జఫర్ఘడ్ డిసెంబర్ 17
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన గుజ్జరి రాజును తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా రాజు మీడియాతో మాట్లాడుతూ..తమ పై నమ్మకంతో నియోజకవర్గం బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.నియోజక వర్గం లో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి,తాటికొండ రాజన్న గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.రాజు అభిమానులు,శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.