వరంగల్ డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన ‘బుట్టబొమ్మ’
Uncategorized
ఈ69న్యూస్ వరంగల్,జూలై 14:ఇన్స్టాగ్రామ్ రీల్స్,సోషల్ మీడియా ఆకర్షణతో మోజుపడి ఓ కుటుంబాన్ని చిత్తుచేసిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష,తన భర్త డాక్టర్ సృజన్ ప్రేమలో కరిగిపోయినట్లు అనిపించిన ఓ రీల్స్ గర్ల్ కారణంగా,చివరికి ప్రాణత్యాగానికి పాల్పడింది.సృజన్ వరంగల్‌లోని మెడికవేర్ హాస్పిటల్లో కార్డియాలజీ డాక్టర్‌గా పని చేస్తుండగా,ప్రత్యూష మరో ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.వీరిద్దరికీ 2017లో వివాహం కాగా,ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.అయితే ఇటీవల‘బుట్టబొమ్మ’గా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాచుర్యం పొందిన శృతి అనే యువతి పై సృజన్ మోజుపడి,భార్యను పట్టించుకోవడం మానేశాడు.ఈ విషయం కారణంగా మనోవేదనకు గురైన ప్రత్యూష,హసన్‌పర్తిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఆమె భర్త సృజన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నా కుమార్తెను విస్మరించి పరస్త్రీపై మోజుపడి ఆత్మహత్యకు కారణమయ్యాడు అంటూ ఆరోపించారు.అంతేకాదు,సృజన్ తన కూతురిని హింసించాడన్న ఆరోపణలు కూడా చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని డాక్టర్ సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది.