ఈ69న్యూస్ వరంగల్:-ఎంసిపిఐ(యూ) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో పార్టీకి ఇటీవల చేరిన కొత్త సభ్యులకు కీలక పదవులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మాలోత్ సాగర్,ముక్కెర రామస్వామిని వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించారు.అలాగే జిల్లా కమిటీ సభ్యులుగా మాలోత్ ప్రత్యుష,గణేపాక ఓదెలు,తాటికాయల రత్నం,సింగారపు దాసు,ఎండీ ఆబ్బులకు అవకాశం కల్పించారు.కార్యవర్గంలో చోటు దక్కిన నాయకులు మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వమిచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మిక హక్కులను తొలగించే కుట్రలు జరుగుతున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు ఎంసిపిఐ(యూ) పోరాట పాతు కట్టినదిగా స్పష్టం చేశారు.తమ ఎంపికకు సహకరించిన జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్,రాష్ట్ర కార్యదర్శి రవి,మరియు వరంగల్ జిల్లా నాయకత్వానికి నూతన కమిటీ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు.