ఈ69న్యూస్ వరంగల్:-కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహిళలకు నాయకత్వ లక్షణాలను నేర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధినేత్రి-ఆలోచన,అధ్యయనం ఆచరణ!అనే మహిళా నాయకత్వ శిక్షణ శిబిరం మంగళవారం వరంగల్ హంటర్ రోడ్డులోని D కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..మహిళలు రాజకీయ రంగంలోకి వచ్చితేనే సమాజ అభివృద్ధికి బాట పడుతుంది.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటుంది.నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళలే భవిష్యత్ మార్గదర్శకులు.ఈ శిబిరం వారిలో ఆత్మవిశ్వాసాన్ని,సామాజిక బాధ్యతను పెంచేందుకు ఉపయోగపడుతుంది,అని అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి.శ్రీనివాస్ రావు,జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ,యువజన మహిళా నాయకులు సాగరిక,శ్వేత,మహిళా కాంగ్రెస్ నేతలు,మాజీ ప్రజాప్రతినిధులు,యువజన విభాగ కార్యకర్తలు పాల్గొన్నారు.