వరంగల్ మట్టెవాడలో నకిలీ సర్టిఫికెట్ల కేసులో 9 మంది అరెస్ట్
Uncategorized
ఈ69న్యూస్ వరంగల్ జూలై 17:-కొద్దిరోజుల క్రితం వరంగల్లోని వేణు రావు కాలనీలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా పై మట్టెవాడ పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు.హనుమాన్ ఆన్లైన్ సెంటర్ నడుపుతున్న నల్లబెల్లి అమరేందర్ అనే వ్యక్తి ఆధారంగా నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో ప్రధాన నిందితుడిగా గుర్తించబడినాడు.అతను ప్రజలకు అత్యవసరంగా కావలసిన ఆధార్ కార్డు సవరణలు,భర్త సర్టిఫికెట్లు,రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు వంటి పలు ప్రభుత్వ పత్రాలను నకిలీగా తయారుచేసి,మీసేవ సెంటర్ల ద్వారా వాటిని చొరబెట్టే కుట్రలో ఉన్నట్లు విచారణలో తేలింది.ప్రస్తుతం అమరేందర్ జైలులో ఉన్నాడు.ఈ కేసులో అతనికి సహకరించిన మరో తొమ్మిది మందిని మట్టెవాడ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు.వారి వివరాలు ఇలా ఉన్నాయి:-1.జూలూరి ప్రభాకర్ (56)ఆధార్ నమోదు సెంటర్-నర్సంపేట్,2.కొన్ని సురేష్ కుమార్ (40)ఆధార్ సెంటర్-గోపాలస్వామిగుడి,వరంగల్,3.వేముల రాజేందర్ (35)ఆధార్ సెంటర్-పరకాల,4.గొల్లపల్లి శశికాంత్ (35)ఆధార్ సెంటర్-పద్మాక్షి కాలనీ,హనుమకొండ,5.సంకరమైన సాగర్ (32)ఇంటర్నెట్ సెంటర్-బర్లగూడెం,భూపాలపల్లి,6.నీరటి రాజేష్ అలియాస్ సుదర్శనం (35)ఆధార్ సెంటర్-నక్కలగుట్ట,హనుమకొండ,7.నాగపురి లిఖిత్ కుమార్ (24)ప్రైవేట్ ఉద్యోగి-నల్లబెల్లి మండలం,8.అజ్మీరా శివ (42)రియల్ ఎస్టేట్-చింతల్,వరంగల్,9.ఎండి జుబేర్ (32)జెడ్ఎన్ ఆన్లైన్ సెంటర్,ఎల్లం బజార్,ఎల్బీనగర్,వరంగల్,ఈ నిందితులను పోచం మైదాన్ సమీపంలోని కార్ల అడ్డ వద్ద గుర్తించి మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిపై నకిలీ పత్రాల తయారీ,ప్రభుత్వ పత్రాల్లో చెల్లుబాటు కానివి కల్పించడం వంటి అభియోగాలతో కేసులు నమోదు చేశారు.పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.