ఈ69 న్యూస్, పామిడి. పామిడి మండలానికి నూతనంగా విచ్చేసిన తహసీల్దార్ షర్మిల గారిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గురువారం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు ఆయుష్ ప్రభుత్వ వైద్యులు నల్లపాటి తిరుపతి నాయుడు లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామారావు ఆధ్వర్యంలో నూతన తహసిల్దార్ షర్మిల కి పుష్ప గుచ్చాలి ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. మండల ప్రజలకు అత్యుత్తమల సేవలందించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని వారు సూచించారు. లైన్స్ క్లబ్ సభ్యులకు మరియు ప్రభుత్వం తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తామని తహసిల్దార్ షర్మిల ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పట్రా శ్రీనివాసులు డిస్టిక్ చైర్ పర్సన్స్ మురళి, జయ రామారావు, సుహాసిని తదితరులు పాల్గొన్నారు