నంగి దేవెందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి అమానుషం
Uncategorizedటిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి
నంగి దేవేందర్ రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించిన కాంగ్రెస్ బృందం
కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కార్యదర్శి నంగి దేవెందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి అత్యంత అమానుషమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కార్యదర్శి నంగి దేవెందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి జరిపిన సంఘటనపై ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఉన్న దేవేందర్ రెడ్డిను ఏపీ మిథున్ రెడ్డి తదితర బృందం పరామర్శించారు. దాడికి గల కారణాలను ఆయన నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని చట్టాలను ఖూనీ చేస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తల తీరుపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దేవెందర్ ను అక్కడే చితక బాదారనీ ఇది గమనించిన ప్రశాంత్ రెడ్డి ప్రోత్బలముతోనే కార్యకర్తలు దేవెందర్ రెడ్డిని వెంట పడి కొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో నంగి దేవెందర్ రెడ్డి చొక్కా చిరిగిపోయిందనీ పోలీసులు ఆయనకు రక్షణగా ఉండి పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు వివాదం కల్పించాలన్న టిఆర్ఎస్ కుట్రలను కాంగ్రెస్ భవనం చేస్తుందని హెచ్చరించారు. దేవేందర్ రెడ్డికి అండగా నిలబడతామని పేర్కొన్నారు.