కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు
Uncategorized
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ( కోటంచ)గ్రామంలో నెలకొన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు,ఆలయ చైర్మన్ ములకనూరి బిక్షపతి,కార్య నిర్వహణాధికారి ఎస్ మహేష్ మీడియాకు తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణమాసం అయినందున ప్రతిరోజు 8 గంటల నుండి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించబడతాయన్నారు. ఈనెల 28వ తేదీన అమ్మవారి పుట్టినరోజు కావున 9 గంటలకు కుంకుమార్చన, ఒడిబియ్యం, 11:30 గంటలకు అమ్మవారి సేవ నివేదన అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. 29వ తేదీన నాగ గరుడ పంచమి అయినందున నాగమయ్య సన్నిధిలో పాలు , ప్రత్యేక పూజలు, నిత్య విధి సర్వదర్శనములు, ఆర్జిత పూజలు, అర్చకులతో పాటు 12 గంటలకు నివేదన ప్రసాద వితరణ, ఆగస్టు 1వ తేదీన స్వాతి మహోత్సవ పూజలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారికి అభిషేకం, సుదర్శన నర్సింహ హోమం, కళ్యాణం ఉంటాయి నివేదన అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. ఆగస్టు 8న సామూహిక వరలక్ష్మీ వ్రతము ఉంటుంది. ఉదయం 9 గంటలకు వరలక్ష్మి వ్రతం లో పాల్గొను భక్తులు ఒక్కరికి 250 రుసుము చెల్లించి రసీదు పొందాలని పొందాలని ఈవో తెలిపారు. సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రతిమ, పసుపు కుంకుమ, అందజేయబడతాయన్నారు. అమ్మవారి నివేదన అనంతరం ప్రసాద్ వికరణ ఉంటుంది. ఆగస్టు 9వ తేదీన రాఖీ పౌర్ణమి అయినందున నిత్య విధి పూజలతో పాటు వితరణ ఉంటుంది వితరణ ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాస నెల రోజులపాటు
నిత్య కుంకుమార్చన పూజలలో గోత్ర నామాలను మాత్రమే చదివించుకుని భక్తులు 500 రూపాయలు చెల్లించి రసీదు పొందాలని తెలిపారు. వీరికి కండువా, రెండు జాకెట్ ముక్కలు, ఒక్క లడ్డు ప్రసాదం అందజేయబడతాయన్నారు.