
సిఐటియు రాష్ట్ర మహాసభల విజయవంతం కోరుతూ విస్తృత ప్రచారం జెండా ఆవిష్కరణలు
సిఐటియు రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 21 22 23 తేదీలలో సిద్దిపేట పట్టణంలో జరగబోతున్నాయని 23వ తేదీన సిఐటియు రాష్ట్ర బహిరంగ సభ సిద్దిపేటలో ఉంటుందని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు తెలిపారు
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా CITUజెండా ఆవిష్కరణలు నిర్వహించామని
జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలో ఘనంగా జండా ఆవిష్కరణ జరిగిందని తెలిపారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై రాజిలేని పోరాటాలు నిర్వహించి ఫలితాలు సాధించి వాటి ఫలాలు కార్మిక వర్గానికి అందించిన కార్మిక వర్గ వేగుచుక్క సీఐటీయూ అని సిఐటియు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు అన్నారు. సోమవారం రోజున సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా సిఐటియు జెండాను జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలంటూ కార్మిక హక్కులను రక్షించాలని కోరుతూ రాజ్యాంగం పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోర్టులను రద్దు పరచాలని దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపై కార్మిక వర్గ పక్షాన పోరాటాలు నిర్వహించింది సిఐటియు అన్నారు. అట్లాంటి సిఐటియు తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు సిద్దిపేట పట్టణంలో డిసెంబర్ 21 22 23 తేదీలలో జరుగుతున్నాయని 23వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వి శివన్ కుట్టి గారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ఈ మహాసభలకు ఉద్యోగం కార్మికులు కర్షకులు స్కీం వర్కర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజయేందర్ జిల్లా కమిటీ సభ్యులు గాడి సువాసిని పట్టణ కమిటీ సభ్యులు గంగారపు మల్లేశ్ రాజ్ కచ్చ గళ్ళ వెంకటేష్ ఎండి మునీర్ గాడి శివ గైని బిక్షం గౌడ్ నీ దగ్గర బాబు గుండె కృష్ణ తదితరులు పాల్గొన్నారు