ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం భూపాలపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేగొండ మండల జర్నలిస్టులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి ప్రెస్ క్లబ్ ఎదుట నినాదాలు చేశారు. గోరి కొత్తపల్లి లో జరిగిన మంత్రుల పర్యటనకు జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. జర్నలిస్టులకు కనీస గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే పై మండల జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘం నాయకులు పట్టెం కోటిలింగం, సామల తిరుపతిరెడ్డి, గాజర్ల తిరుపతి గౌడ్, బండి సోమయ్య గౌడ్, బండి కమలాకర్ గౌడ్, సుంకరి శ్రీధర్ పటేల్, బత్తుల ఆనంద్ నేత, బండి సమ్మయ్య గౌడ్, నామాల రమేష్, రొంటాల శంకర్, మంతెన సురేష్, బండారి రాజు, గూనిగంటి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.