
అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం-జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్
ఈ69 న్యూస్ జనగామ/జఫర్గడ్, జూలై 22
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు.మండల ఇంచార్జ్ మారేపల్లి రవి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ హాజరై ముఖ్య ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణకు బీజేపీ నాయకత్వం అవసరం.ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు.ఆయన పాలన ప్రజలకు ఢిల్లీ నుండి గల్లీ వరకూ కనిపిస్తున్నది.జఫర్గడ్ వంటి చైతన్యవంతమైన ప్రాంతాల్లో యువతే ముందుండి పోరాటం చేస్తున్నారు,అన్నారు.అంతేగాక,ఈసారి స్థానిక ఎన్నికల్లో జఫర్గడ్ మండలంలోని ప్రతి వార్డు,సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ స్థాయిల్లో బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తారు.కేంద్ర పథకాలను ప్రజలకు చేరేలా ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలి,అని పిలుపునిచ్చారు.
పార్టీలో కొత్త చేరికలు:ఈ కార్యశాలలో తిడుగు గ్రామం నుండి బండి ఉప్పలయ్య గౌడ్,తిమ్మంపేట గ్రామం నుండి ముస్కు కుమార్ బీజేపీలో చేరారు.వీరి చేరిక జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ సమక్షంలో జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ అయిలోని అంజి రెడ్డి,మండల ప్రభారి భాగాల నవీన్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు తౌటి సురేష్ గౌడ్,బీజెవైఎం జిల్లా కార్యదర్శి పల్లె సంతోష్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు ఎదులాపురం మదన్ మోహన్,సెల్ జిల్లా కన్వీనర్ మెరుగు రామరాజు గౌడ్,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఇల్లందుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.అలాగే,మండల ప్రధాన కార్యదర్శి గొలుసుల లింగ యాదవ్,కార్యదర్శి చీరబోయిన కవిత,సోషల్ మీడియా కన్వీనర్ కత్తి సందీప్ గౌడ్,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గాదెపాక శ్రీను,మన్ కి బాత్ కన్వీనర్ గిరాగోని యాదగిరి గౌడ్,ఓబీసీ మోర్చా నేతలు పందిబోయిన యాదగిరి,ఎడేళ్లి కార్తీక్,బూత్ అధ్యక్షులు గబ్బేట వెంకటయ్య,చవనబోయిన శ్రీనివాస్,తీగారపు బుచ్చయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.