ఈ69 న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్,జూలై 22 బహుజన సమాజం ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రజాస్వామ్యంలో వారికి న్యాయం జరుగుతుందని బహుజన సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బహుజనులు తమ సామూహిక శక్తిని చాటాలి.మన సమాజానికి కావలసింది అధికారం.అది రావాలంటే ఐక్యతే మార్గం అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని,బీసీ జనాభా లెక్కల ప్రకటన తక్షణమే జరగాలని డిమాండ్ చేశారు.అలాగే,తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు.భారతదేశంలో గత 75 ఏళ్లుగా అధికారంలో ఉండిన అగ్రవర్ణ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ,తెలంగాణలో బ్రీఎస్ పార్టీ ఇవన్నీ ఒకే విధంగా బహుజనుల మనోభావాలను దగా చేస్తూ,అధికారం మీద ఆధిపత్య కులాలను నిలబెడుతున్నాయి,అని విమర్శించారు.బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే బీఎస్పీనే మార్గం,అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుర్రం కుమారస్వామి,గుండె అరుణ్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.