మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం,కళ్యాణోత్సవం,రుద్రహోమంతో భక్తి శ్రద్ధల పర్వదినం ఈ69 న్యూస్ ఐనవోలు,జూలై 23 హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మాసశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామి వారికి వివిధ ధార్మిక కార్యక్రమాలు శ్రద్ధా గౌరవాలతో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం,శ్రీ స్వామివారి కళ్యాణం,రుద్రహోమం,ఒగ్గు పూజారులచే పెద్దపట్నం వేయడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ పుణ్య కార్యక్రమాలలో దేవాలయ ముఖ్య అర్చకులు అయినవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ,విక్రాంత్ వినాయక జోషి తదితరులు భాగస్వామ్యమయ్యారు.పలువురు భక్తులు,అర్చక సిబ్బంది భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.ఈ వివరాలను దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు మీడియాకు తెలియజేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు తెలిపారు.దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.