
127 వ మహాసభలకు ముస్తాబవుతున్న ఖాదియాన్
కోవిడానంతర విస్తృతస్థాయి మహాసభలకు అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తున్నారని దక్షిణ భారత దఅవత్తే ఇలల్లాహ్ ప్రతినిధి వెల్లడించారు
,హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ ఖాదియాని 130 సంవత్సరాల క్రితం ప్రారంభించిన జలస సలానా అనబడు అహ్మదియా ముస్లిం వార్షిక మహాసభలు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో చివరి వారంలో పంజాబ్ రాష్ట్రం ఖాదియాన్ లో జరుపబడుతుంది,
ఈ మహాసభలో విశ్వవ్యాప్తంగా రెండు వందల ఇరవై దేశాలలో వ్యాపించి ఉన్న అహ్మదియా ముస్లిం ప్రతినిధులు పాల్గొంటారు,
ఈ సభల ప్రత్యేక ఆకర్షణ అహ్మదీయ ముస్లిం జమాత్ ఆత్మీయ నాయకుడు హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ ఖలీఫా గారి చివరి రోజు ప్రబాషణమగును,
ముస్లిం టెలివిషన్ అహ్మదియా ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా మహాసభల కార్యక్రమములు ప్రపంచమందట వీక్షించనున్నారు ,
అలా కాకుండా ఉర్దూ ఇంగ్లీష్ పంజాబీ భాషలలో జరుగు ఉపన్యాసములు వివిధ భారతీయ ప్రాంతీయ భాషలలో తత్సమయ తర్జుమా చేసి వినిపించనున్నారు,
ఈ రోజు ఖాదియాన్ బుస్తానె అహ్మద్ లొ జరిగిన సబా సేవకుల పర్యవేక్షణ కార్యక్రమంలో బారత అధ్యక్షుడు ముహమ్మద్ ఇనాం గోరి మాట్లాడుతూ ఈ సభలు కేవలం ధార్మిక ప్రగతి కొరకే కాబట్టి దైవారాధన,దైవస్మరణలొ మునిగి ఉంటాలని సూచించారు, ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రతినిధులు వందల సంఖ్యలో బయలుదేరింది,