ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండప్రజా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని రేగొండ మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రేగొండ మండల కేంద్రంలో 20 లక్షలతో నూతనంగా ఏర్పడిన పల్లె దావఖాన ను ఎమ్మెల్యే ప్రారంభించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో 7900 పోస్టులను భర్తీ చేశారన్నారు. భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామన్నారు. అలాగే ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న 203 పోస్టులను భర్తీ చేశామన్నారు. రూపాయలు 14 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, సరైన వసతి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 32 లక్షలతో వెంటిలేటర్, రూపాయలు 3.10 కోట్లతో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేశామన్నారు, రానున్న రెండు నెలల్లో ఎంఆర్ఐ మిషిన్ ను కూడా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు, మొగుళ్ళపల్లి,శాయంపేట మండలాలలో 108 వాహనం లేని కొరత కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిన్నారు. పల్లె దవాఖానను సద్వినియోగం చేసుకొని సేవలను వినియోగించుకోవాలని రేగొండ మండల ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీదేవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హిమ బిందు, సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.