ఈ69న్యూస్ జనగామ,స్టేషన్ ఘనపూర్,జూలై 23 జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన నోముల అశ్విని జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో,ఆమెకు మండలంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొక్క రామచంద్రయ్య ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించారు.నోముల అశ్విని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసి,అనంతరం ఈ శ్రేష్ఠమైన విజయం సాధించారు.ఆమెను ప్రోత్సహించడానికి,సత్కరించడానికి భారీగా నాయకులు,అభిమానులు,గ్రామస్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్ల మల్లేశం,మహమ్మద్ జహంగీర్,ఉమ్మగొని నరసయ్య,మండల ప్రధాన కార్యదర్శి కొంగరి నర్సింగరావు,అలాగే రామగుండం దశరథ,అడ్డూరి శ్రీనివాస్,గండికోట యాదగిరి,కాదునూరి మధుసూదన్,ఉమా గాని శ్రీహరి,కర్రే వంశీ,చెంచు బుచ్చిరెడ్డి,బైరగుని రాములు తదితరులు పాల్గొన్నారు.అవకాశాన్ని వినియోగించుకుంటూ యువత ఎంతో శ్రమతో ఉన్నతస్థానాలకు ఎదగాలన్న సందేశం నోముల అశ్విని విజయానికి ఉదాహరణగా నిలుస్తుందని నాయకులు అన్నారు.ఆమెను శాలువాతో సత్కరించి,విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.