ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో గురువారం జరిగింది. బాధిత రైతు వివరాల ప్రకారం మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బోయిని రవీందర్ కు గల పాడి గేదె రోజు వారి మేత లో భాగంగా పశువుల కాపరి మేతకు తోలుకెళ్లాడు. కాగా బాగిర్తిపేట గ్రామ శివారులో గల ఓ రైతు బావి మోటారుకు ఉన్న సర్వీస్ వైరు ప్రమాదవశాత్తు గేదెకు చుట్టుకొని అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన పశువుల కాపరి కాపాడే ప్రయత్నంచేయగా అతనికి కూడా షాక్ తగిలి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనకు నిర్లక్షపూరితంగా నేలపై సర్వీస్ వైరు ఉంచిన రైతు,విద్యుత్ శాఖ అధికారులే కారణమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గేదె సుమారు రూ.70 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని రైతు రవీందర్ కోరారు.