పేదింటి బిడ్డకు డాక్టరేట్ గౌరవం
Uncategorizedఓయూ నుంచి డాక్టరేట్ పట్టా పొందిన డబ్బేట రమేష్ యాదవ్

ఈ69న్యూస్ హన్మకొండ/ధర్మసాగర్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన డబ్బేట రమేష్ యాదవ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి కలిగి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ, నిరంతర కృషితో ఈ గౌరవాన్ని సాధించడం గర్వకారణమని గ్రామస్థులు తెలిపారు.
ప్రొఫెసర్ అనుముల శ్రీదేవి పర్యవేక్షణలో రమేష్ యాదవ్ సమర్పించిన పరిశోధనా గ్రంథం
“Social Realism: A Comparative Study of the Select Novels of Michael Chabon and Jonathan Safran Foer” విశేషంగా మెప్పించి డాక్టరేట్ కు అర్హత సాధించారు.
రమేష్ యాదవ్ విద్యాభ్యాసం పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది.
పదవ తరగతి: నారాయణగిరి ప్రభుత్వ పాఠశాల
ఇంటర్: ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
డిగ్రీ: హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల.
MA (ఇంగ్లీష్): ఉస్మానియా విశ్వవిద్యాలయం.
ప్రస్తుతం కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా డాక్టరేట్ పట్టా పొందిన రమేష్ యాదవ్‌ను స్నేహితులు,కుటుంబ సభ్యులు,అధ్యాపకులు హృదయపూర్వకంగా అభినందించారు.