
క్రిస్మస్ పండుగ సందర్బంగా నిరుపేద క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే సండ్ర
అన్ని, మత సంప్రదాయలను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ
…………………
తల్లాడ : తల్లాడ రైతు వేదిక లో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న క్రిస్టమస్ పండుగ సందర్భంగా క్రైస్తవ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గోని పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ*
తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ, ప్రతి పండుగకు క్రిష్టమస్ వస్తే క్రిస్టియన్స్ కు దుస్తులు పంపిణీ, మరి రంజాన్ కు ముస్లిం లకు తోపా, మరియు హిందువులు అందరికి దసరా వస్తే బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం, ఇలా ప్రతి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ గారు ఒక చిరు కానుకగా అందించడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా జరుపుకునే పండుగ క్రిష్టమస్ అని, క్రీస్తు బోధనలు యేసు క్రీస్తు అనుసరిస్తున్న శాంతి,సందేశాలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో
బి. ఆర్. యస్ మండల అధ్యక్షులు రెడ్డం. వీరమోహన్ రెడ్డి, జడ్పీటీసీ ప్రమీల, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి. భద్ర రాజు, రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర. వెంకటలల్, M. R. O గంట. శ్రీలత, R. I శ్రీనివాస్,సర్పంచ్ జొన్నలగడ్డ. కిరణ్ బాబు,బి. ఆర్. యస్ జోనల్ అధ్యక్షులు బద్ధం. కోటిరెడ్డి, కేతినేని. చలపతి రావు, దగ్గుల శ్రీనివాస రెడ్డి, బి. ఆర్. యస్ పట్టణ అధ్యక్షులు జి. వి. ఆర్, మాజీ సర్పంచ్ మువ్వా. మురళి, ఎంపీటీసీ రుద్రాక్ష. బ్రమ్మం,వార్డు మెంబెర్ తేల్లూరి. రఘు, పాస్టర్స్ మేకల. ప్రసాద్, సంఘసాని. శ్రీనివాస రావు,అన్ని చేర్చిల ఫాథర్స్ తదితరులు పాల్గొన్నారు