విద్యుత్ శాఖ డిస్కాం స్టోర్‌లో పనిచేస్తున్న హమాలీలను ఆర్టిజన్స్‌గా నియమించాలి
Uncategorizedకోరుతూ టిజి ఎస్‌పిడిసిఎల్‌కు వినతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పవర్ డిస్కాంలలో గత 30 సం॥ల నుండి లోడిరగ్‌అన్‌లోడిరగ్ కార్మికులుగా పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్‌ను డిస్కాం స్టోర్స్‌లో గుర్తింపు కార్డులు పొంది ఉన్న వారిని ఆర్టిజన్స్ క్రింద రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈరోజు (తేది: 25
072025)న మింట్ కాంపౌండ్‌లో ఎలక్ట్రిసిటీ కార్యాలయం టిఎస్ ఎస్పిడిసిఎల్ ఛైర్మన్ Ê మేనేజింగ్ డైరెక్టర్ ముజుఫర్ ఫరూఖీ, ఐఏఎస్ గారిని కలిసి మిర్యాలగూడెం మాజీ ఎంఎల్ఏ జూలకంటి రంగారెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదయ్య, ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, సిఐటియు సూర్యాపేట జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, కిరణ్, గిరి, శ్రీనివాస్ (మహబూబ్‌నగర్), రవి తదితరులు వినతి పత్రం అందజేశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో పనిచేస్తున్న లోడిరడ్
అన్లోడిరగ్ కార్మికుల వివరాలు 2013లో తీసుకొని ఇప్పటివరకు రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. గత 30 సం॥లుగా ఈ వృత్తినే నమ్ముకొని పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టిజన్స్‌గా గుర్తించి రెగ్యులర్ చేస్తారనే ఆశతో ఈ ప్రమాదకరమైన పనిని చేస్తున్నారు. వీరంతా నిరుపేద దళిత, బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే. కనుక వెంటనే ఎలక్ట్రిసిటీ స్టోర్లలో పనిచేసే లోడిరడ్`అన్లోడిరగ్ కార్మికులకు కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ప్రభుత్వం ఆర్టిజన్స్‌గా గుర్తించి రెగ్యులర్ చేయాలని వారు కోరారు. టిఎస్ ఎస్పిడిసిఎల్ ఛైర్మన్ Ê మేనేజింగ్ డైరెక్టర్ గారు స్పందిస్తూ ఈ విషయం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు.