ఈ69న్యూస్ హనుమకొండ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,ఒంటరి మహిళలు,నేత బీడీ కార్మికులకు అందుతున్న చేయూత పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామ కమిటీ సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోంపల్లి అన్వేష్ మాదిగ అధ్యక్షత వహించగా,ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సోమన్న మాదిగ మరియు ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం తక్షణమే చేయూత పెన్షన్లను రూ.2000 నుంచి రూ.6000 వరకు పెంచాలి.కండరాల క్షీణత బాధితులకు రూ.15,000 ఇవ్వాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అని కోరారు.ఇకపోతే,ఆగస్టు 13న హైదరాబాదులో జరగనున్న వికలాంగుల 'చేయూత పెన్షన్ల మహాగర్జన సభ' విజయవంతం చేయాలన్నారు.ఈ సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు.హనుమకొండ జిల్లాలోని ప్రతి గ్రామం నుండి కనీసం 100 మంది పెన్షనుదారులు హాజరుకావాలని కోరారు.సమావేశంలో వికలాంగుల కమిటీ,చేయూత పెన్షన్ ధరల కమిటీ,గ్రామ శాఖ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీకి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.