
ఈ69న్యూస్ వరంగల్/రాయపర్తి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క శాఖ మజ్లిస్ అన్సారుల్లాహ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశం మజ్లిస్ జయీం ఖుర్బాన్ అలీ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాజిం అన్సారుల్లాహ్ ముహమ్మద్ సలీం హాజరై ప్రసంగం చేశారు.ఆయన మాట్లాడుతూ..ప్రతీ సంవత్సరం అన్సారుల్లాహ్ వార్షిక ఇజ్తిమా జిల్లా స్థాయిలో ఎంతో ఆత్మీయతతో నిర్వహించబడుతోంది.ఈ సంవత్సరం ఆగస్టు 10న కాట్రపల్రి గ్రామంలో జరగనున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అన్సార్ విజయవంతం చేయడానికి కృషి చేయాలి అని ఆకాంక్షించారు.ఇజ్తిమా ఏర్పాట్లకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మజ్లిస్ సభ్యులైన సదర్ యూసుఫ్ సాహెబ్,మౌల్వీ అస్ఘర్ సాహెబ్,చందా ఇన్స్పెక్టర్ ముబీన్ అహ్మద్ సాహెబ్,రహీమొద్దీన్ సాహెబ్,బషీర్ సాహెబ్,గుంశావాలి సాహెబ్,అబ్బాస్ అలీ సాహెబ్,నజీర్ సాహెబ్,అబ్దుర్ రెహమాన్ సాహెబ్,జబ్బార్ సాహెబ్,షహదాత్ అలీ సాహెబ్,మహిమూద్ సాహెబ్,నూరొద్దీన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.