ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరిజయశంకర్ భూపాలపల్లి జిల్లా లో గత వారం రోజులు నుండి ఏడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు కాలువలు చెరువులలో వరద ఉదృక్తంగా ప్రవహిస్తున్నందున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు యువకులు ప్రమాద బారిన పడే అవకాశం ఉన్నందున చేపల వేటను వరదలు ఉన్న సమయంలో మానుకోవాలని ఎస్ఐ వారికి సూచించారు. ఆదివారం బాలయ్య పల్లి గ్రామంలో ప్రజలతో మత్స్యకారులతో ఎస్సై సమావేశం నిర్వహించి వర్షాల కారణంగా వరదలు ఉదృక్తంగా ప్రవహిస్తున్నందున చేపల వేటను వీలైనంతవరకు తగ్గించుకోవాలని, పెద్దలు,పిల్లలు చెరువులోకి వెళ్లి నీటిలోతు తెలియక ప్రమాదానికి గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉందని, అందుకే అందరూ తమ వంతుగా చేపల వేటను వెంటనే నిలిపివేయాలని ఎస్సై సూచించారు. గ్రామంలోని యువత అందరికీ ఆదర్శంగా నిలుస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని ఎస్ఐ గ్రామంలో ని యువకులకు దిశ నిర్దేశం చేశారు.గ్రామంలోని సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎస్ఐ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరైనా తమ సమస్యలను పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీస్ సిబ్బంది సహకారం తీసుకొని పరిష్కరించుకోవాలని ఎస్సై వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.