10 నెలల కోడి గుడ్ల బిల్లులు పెండింగ్
Ranga Reddy5 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు
రంగా రెడ్డి జిల్లా DEO గారికి మెమో రాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన రాష్ట్ర అధ్యక్షులు యెలమొని స్వప్న మాట్లాడుతూ,
మధ్యాహ్న భోజన కార్మికుల 10 నెలల నుండి కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి,
మధ్యాహ్న భోజనం కార్మికులు ఎంత కాలం అప్పులు చేసి పెడతారు పెండింగ్ వేతనాలు బిల్లులు చెల్లించాలని అధికారులు చుట్టూ కార్మికుల చెప్పులు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పథకం నిర్వహణ సక్రమంగా సాగాలంటే వివేతనాలు బిల్లులు తక్షణమే చెల్లించాలని , ప్రభుత్వమే వంట గ్యాస్ ఇవ్వాలని, వంట చెట్లు లేనిచో నూతనంగానిర్మించాలని,సంవత్సరాలుగా ఈ పథకంలో పనిచేస్తున్నప్పటికీ కార్మికులకు కనీస వేతనంఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, కార్మికులకు డ్రెస్ కోట్ వంటి సౌకర్యాలు భద్రత బెనిఫిట్ వంటివి ప్రభుత్వము కల్పించడం లేదు కాబట్టి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 10,000 వేతనం ఇస్తానని చెప్పారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పట్టించుకోవడం లేదు, కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో 2025 ఆగస్టు ఆరవ తారీఖున జిల్లావ్యాప్తంగా పాఠశాలలు వంట బందు పెట్టి చలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయము హైదరాబాద్ లో ధర్నా నిర్వహిస్తా మని అన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చింతపట్ల ఎల్లేశా, జే పెంటయ్య, మధ్యాహ్న భోజన రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్, పద్మ, రాధా రమాదేవి జయమ్మ అంజమ్మ శిరీష, సుధాకర్ రాజేష్ నరేందర్, యాదమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు