
ఈ69
హన్మకొండ నయీమ్నగర్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో అనుమానాస్పద మృతితో కలకలం రేగింది.మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి శివాని (16)అనే విద్యార్థిని,కళాశాలలో ఎంఫీసీ మొదటి సంవత్సరం చదువుతో ఉండగా,మంగళవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం.విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కళాశాల యాజమాన్యం నేరుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఈ వ్యవహారంపై విద్యార్థులలో మరియు స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.సంఘటన స్థలంలో శివాని రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ ఒకటి లభించింది.అందులో కళాశాలలో చేర్చేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచిస్తూ,తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా,శివాని మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.