
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయం నిర్మించడానికి MGNREGS నుండీ రూ 20లక్షలు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య గారి సహాయ సహకారాలతో మంజూరు చేసిన శుభ సందర్బంగా ఈ రోజు స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ & నియోజకవర్గ BRS కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డిటిఆర్ గారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తదుపరి చైర్మన్ గారు మాట్లాడుతూ….. గౌరవ ఎమ్మెల్యే డా. రాజన్న గారికి గ్రామం మీద ఉన్న ప్రేమతో, గ్రామ పంచాయితీ చాలా రోజుల నుండీ శిథిలావస్థలో, చిన్నగా ఉండడం వల్ల వారు మంచి మనసుతో కొత్త పంచాయితీ కార్యాలయం నిర్మించుకోవడానికి వారి సహాయంతో మంజూరు చేయించడం చాలా సంతోషంగా ఉందని వారికి ప్రతేక్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అదే విధంగా వారికి తమ్మడపల్లి జీ గ్రామం అంటే ఎంతో ఇష్టం అని ఇంకా వారి ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ది చేసుకుందామని తెలిపారు. అదే విధంగా మండల వ్యాప్తంగా 9 గ్రామ పంచాయితీ లకు నిధులు మంజూరు చేయించిన రాజన్న గారికి మండల ప్రజల తర్పున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య,BRS మండల పార్టీ ఉప అద్యక్షుడు రాపర్తి రాజ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ లోకిని భిక్షపమ్మసాయిలు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి గార్లు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.